బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ‘మణికర్ణిక’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం యొక్క పూర్తి షూటింగ్ నిన్నటితో ముగిసింది. ఘాన్సీ రాణి లక్ష్మీభాయి జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో కంగనా లక్ష్మీబాయి పాత్రను పోషించారు.
ఇండియాలోనే భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ లేడీ ఓరియెంటెడ్ సినిమాకు ‘బాహుబలి’ రచయిత విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ అందించారు. జీ సినిమాస్, కమల్ జైన్, నిషాంత్ పిట్టిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2018 ఆగష్టు 15న తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదలచేయనున్నారు.


