‘పవన్ – హరీష్’ సినిమాలో కృతి శెట్టి ?

‘పవన్ – హరీష్’ సినిమాలో కృతి శెట్టి ?

Published on Jul 3, 2021 11:42 PM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా పై ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఇప్పటికే హరీష్ శంకర్ ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తి చేశాడు. అయితే ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ కృతి శెట్టికి హరీష్ అవకాశం ఇస్తున్నట్లు తెలుస్తోంది. హరీష్ శంకర్ సినిమాలో ఓ కీలక పాత్ర ఉందట. పవన్ కళ్యాణ్ అన్నయ్య కుమార్తెగా ఒక రోల్ ఉందట. ఆ పాత్రలోనే ఈ యంగ్ హీరోయిన్ ను తీసుకున్నట్లు తెలుస్తోంది.

కాగా ఆగస్టు నుండి ఈ సినిమా షూట్ మొదలు కానుందట. ఇక పవన్ కళ్యాణ్ ఇటీవలే ఈ సినిమా కోసం ప్రత్యేక ఫోటోషూట్‌ లో పాల్గొన్నట్లు వార్తలు వచ్చాయి. పవర్ స్టార్ ఈ సినిమాలో కొత్త లుక్ తో పాటు కొత్త హెయిర్ స్టైల్ ను ప్లాన్ చేసున్నారట. ఇక ఈ సినిమాలో పవన్ ప్లాష్ బ్యాక్ లో పోలీస్ ఆఫీసర్ గా నటించబోతున్నాడు.

ఇక గతంలో హరీష్, పవన్ కాంబినేషన్లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ పవన్ కెరీర్ లోనే ప్రత్యేకంగా నిలిచిపోయింది. అప్పటికే వరుస ప్లాప్స్ లో ఉన్న పవన్.. గబ్బర్ సింగ్ తో ఇండస్ట్రీ రికార్డ్స్ ను క్రియేట్ చేశాడు. అందుకే వీరి సినిమా పై అభిమానుల్లోనే కాదు ప్రేక్షకులందరిలో మంచి ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు