
నటి కృతి సనన్ ప్రస్తుతం తన బాలీవుడ్ మొదటి సినిమా ‘హీరోపంతి’ సినిమా ప్రచారం కార్యక్రమాలలో బిజీగా ఉంది. ఇటివల తను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మొదట్లో తను ముద్దు సన్నివేశాలలో నటించడానికి ఒప్పుకోలేదని తెలిపింది. మొదట దర్శకుడు, ఈ సన్నివేశం గురించి తనకు వివరించినప్పుడు, ఈ సిన్ సినిమాలో అవసరమా అని అడిగినట్టు చెప్పింది. అయితే కథలో ఈ సన్నివేశం అవసరం అని దర్శకుడు తెలియచేయడంతో, దీనికి ఒప్పుకున్నాని, ఈ సన్నివేశం చాలా బాగా వచ్చిందని ఆమె తెలిపారు.
కృతి ఇంకా మాట్లాడుతూ తను ఒక సంప్రదాయ బద్ధమైన కుటుంబం నుండి వచ్చానని, అయినా తన తల్లితండ్రులు తనకు ఎప్పుడు అండగా ఉంటారని చెప్పింది. కథకు అవసరం అయితే ఇలాంటి సన్నివేశాలలో నటించడానికి అబ్యంతరం లేదని తెలిపింది. తెలుగులో కృతి సనన్ తన తదుపరి చిత్రంలో నాగ చైతన్య సరసన నటిస్తుందని సమాచారం.

