టాలీవుడ్ పై ఆసక్తి చూపిస్తోన్న ‘కృతి సనన్’ !

Published on May 15, 2021 9:41 pm IST

హీరోయిన్ ‘కృతి సనన్’ భారీ ప్రాజెక్టుల హీరోయిన్ గా ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంది. అయితే, ఆమెకు హిందీ సినిమాల్లో అవకాశాలు రాని సమయంలోనే కృతి సనన్ ని తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం చేశాడు దర్శకుడు సుకుమార్. మహేష్ బాబు నటించిన ‘1 నేనొక్కడినే’ ఆమె మొదటి చిత్రం. అయితే ఆ సినిమా తరువాత ఆమె తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించలేదు.

కానీ ఇన్నేళ్లకి మళ్ళీ ఆమె ప్రభాస్ సరసన ‘ఆదిపురుష్’ సినిమాలో సీత పాత్రలో నటించబోతుంది. ఈ సినిమా కోసమే ఆమె తెలుగు నేర్చుకోవడానికి తెగ కష్టపడుతుంది. ఇక అటు బాలీవుడ్ లోనూ ఆమెకు వరుస అవకాశాలు రావడం వస్తున్నాయి. పైగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు వెతుక్కుంటూ వస్తున్నాయి. అయితే కృతి మాత్రం మళ్ళీ తెలుగు సినిమాల వైపు ఆసక్తి చూపిస్తోందట. అందుకే తెలుగు కూడా నేర్చుకుంటుందట.

సంబంధిత సమాచారం :