
సుధీర్ వర్మ దర్శకత్వంలో యువ మన్మధుడు అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న సినిమా ‘దోచేయ్’. ‘1 నేనొక్కడినే’ ఫేం కృతి సనన్ ఈ సినిమాలో హీరోయిన్. ఈ సినిమా టీంతో కృతి జత కలిసింది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ రాజధాని నగరంలో జరుగుతుంది. ‘దోచేయ్’ షూటింగ్ చివరిదశకు చేరుకుంది. కేవలం క్లైమాక్స్ మరియు సాంగ్స్ షూటింగ్ బాలన్స్ ఉంది.
యాక్షన్ & క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బ్రహ్మానందం ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బివిఎస్ఎస్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సన్నీ ఎంఆర్ సంగీత దర్శకుడు. ఈ సినిమాను మార్చి 20వ తేదిన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

