“ఆదిపురుష్” షూట్ పై ఎగ్జైట్ అవుతున్న కృతి.!

Published on Jun 11, 2021 3:00 pm IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న పలు భారీ ప్రాజెక్ట్స్ లో దర్శకుడు ఓంరౌత్ తో ప్లాన్ చేసిన చిత్రం “ఆదిపురుష్” కూడా ఒకటి. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ భారీ ఇతిహాస చిత్రంపై ఎనలేని అంచనాలు కూడా నెలకొన్నాయి. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ ను ఎంపిక చేసి షూటింగ్ కూడా కొన్ని రోజులు జరిపారు.

మరి సీతాదేవి పాత్రలో నటిస్తున్న ఈ కృతి సనన్ లేటెస్ట్ ఇన్స్టా చాట్స్ లో “ఆదిపురుష్” షూట్ పై ఎగ్జైట్ అవుతున్నట్టు తెలిపింది. ఈ సరికొత్త ఎక్స్ పీరియన్స్ ను తాను చాలా డిఫరెంట్ గా ఫీల్ అవుతున్నానని, ప్రతి అంశం కూడా ఈ షూట్ లో ఎంజాయ్ చేస్తున్నానని తెలిపి తమ డైరెక్టర్ ఓంరౌత్ తో షూట్ తొందరగా స్టార్ట్ చేద్దామా.. అని తెలిపింది.. దీనిని బట్టి ఈ సినిమా విషయంలో కృతి ఎంత ఎగ్జైటెడ్ గా ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ భారీ చిత్రంలో రావణ పాత్రలో సైఫ్ అలీఖాన్ నటిస్తుండగా సన్నీ సింగ్ లక్ష్మణ పాత్రలో నటిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :