ప్రభాస్ సరసన సీతగా కృతి సనోన్‌..!

Published on Nov 28, 2020 7:08 pm IST

నేషనల్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ బడా ద‌ర్శ‌కుడు సంజ‌య్ రౌత్ తో “ఏ- ఆది పురుష్” అనే మరో భారీ సినిమాని ప్ర‌క‌టించిన సంగతి తెలిసిందే. దాదాపు 500 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కిస్తున్న ఈ సినిమా ఆదికావ్యం రామాయణం ఆధారంగా తెరకెక్కుతుందట. కాగా రాముడిగా ప్రభాస్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం సీతగా కృతి సనోన్‌ ను ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది.

కాగా కృతి సనోన్‌ గతంలో సూపర్ స్టార్ మహేష్ సరసన వన్: నేనొక్కడినే, నాగచైతన్య సరసన దోచేయ్ సినిమాల్లో నటించింది. ఇక తన మార్కెట్ కి తగ్గట్లుగానే బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలను సెట్ చేసుకుంటూ ప్రభాస్ ముందుకు పోతున్నాడు. అలాగే ఈ భారీ ప్రాజెక్ట్ ను నార్మల్ గానే కాకుండా ప్రభాస్ ఇది వరకు టచ్ చెయ్యని 3డి టెక్నాలజీలో తెరకెక్కించనున్నారు. మరి ఈ భారీ చిత్రం ఎలా ఉండనుందో తెలియాలి అంటే ఇంకొన్నాళ్ళు ఆగక తప్పదు.

సంబంధిత సమాచారం :

More