స్టార్ హీరో పై వివాదాస్పద ట్వీట్ !

Published on Jun 13, 2021 4:50 pm IST

నేడు బాలీవుడ్‌ హీరోయిన్ ‘దిశా పటానీ’ పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియాలో అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే, ఫిల్మ్ క్రిటిక్ కమల్‌ ఆర్‌ ఖాన్‌(కేఆర్‌కే) దిశాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ వివాదాస్పద ట్వీట్ చేశాడు. ‘డియర్ దిశా పటానీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. కానీ నువ్వు, ముసలి హీరోల సరసన చాలా భయంకరంగా కనిపిస్తున్నావు. అందుకే, నువ్వు కేవలం టైగర్‌ పక్కన మాత్రమే నటించు, బాగుంటుంది” అని కేఆర్‌కే పోస్ట్ చేశాడు.

కాగా కేఆర్కే ట్వీట్ చేసింది సల్మాన్ ను అవమానించడానికేనట. అందుకే ఇప్పుడు ఈ కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ఇక కేఆర్కే పై సల్మాన్ ఖాన్ అభిమానులు విరుచుకుపడుతున్నారు. హిందీ పరిశ్రమలో కేఆర్‌కే రివ్యూస్ కి విలువ ఉంది. అందుకే ఆయన కామెంట్స్ ఎప్పుడు వైరల్ అవుతాయి. ‘రాధే’ సినిమా పై తనకు అనుకూలంగా రివ్యూ ఇవ్వనందుకే సల్మాన్‌ ఖాన్ తన మీద కేసు వేయించాడని, అయినా తానూ తగ్గను అని కేఆర్‌కే చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :