డైరెక్షన్ చేయనున్న ‘సీఎం’ కోడలు !

Published on Jun 7, 2021 9:05 pm IST

త‌మిళ‌నాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ కోడలు కృతిక ఉద‌య‌నిధి మల్టీ టాలెంటెడ్. ఆమెలో ఒక నిర్మాతతో పాటు రచయిత దర్శకురాలు కూడా ఉంది. ఆమె గతంలో కృతిక వ‌ణ‌క్క‌మ్ చెన్నై, కాళి వంటి చిత్రాల‌ను తెర‌కెక్కించి తనలోని దర్శకత్వపనితనం చూపించారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఆమె మెగాఫోన్ పట్టుకోవడానికి రెడీ అవుతున్నారు.

కృతిక ఉద‌య‌నిధి డైరెక్ట్ చేస్తున్న సినిమాలో యంగ్ హీరో కాళిదాస్ జ‌య‌రాం, హీరోయిన్ తాన్య ర‌విచంద్ర‌న్ జంట‌గా కలిసి న‌టిస్తున్నారు. నిర్మాత పెంటెల సాగ‌ర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదొక జ‌ర్నీ ఆఫ్ లైఫ్ మూవీ అని, ఈ సినిమా నేపథ్యం కొత్తగా ఉండబోతుందని తెలుస్తోంది. ఇక లాక్‌ డౌన్ పూర్తి కాగానే ఈ సినిమా షూటింగ్‌ ను స్టార్ట్ చేస్తామ‌ని కృతిక చెప్పుకొచ్చింది.

సంబంధిత సమాచారం :