హీరోయిన్ కి వెంటనే రిప్లే ఇచ్చిన కేటీఆర్ !

హీరోయిన్ కి వెంటనే రిప్లే ఇచ్చిన కేటీఆర్ !

Published on Jun 24, 2018 8:00 PM IST


తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేయగా, ఆమె ట్వీట్ కి కేటీఆర్ వెంటనే రిప్లే ఇచ్చారు. వివారాల్లోకి వెళ్తే కొన్ని రాష్ట్రాలు ప్లాస్టిక్‌ను బ్యాన్ చేస్తుండగా ప‌లు రంగాల్లో అగ్ర‌గామిగా నిలుస్తున్న మన తెలంగాణ రాష్ట్రం ప్లాస్టిక్‌ను బ్యాన్ చేస్తున్న రాష్ట్రాల జాబితాలో లేక‌పోవ‌డం నాకు బాధ క‌లిగించిందంటూ ఈషా రెబ్బ ట్వీట్ చేశారు. ఇంకా ఆమె ట్వీట్ లో ప్లాస్టిక్ ను బ్యాన్ చేసి భావి త‌రాల‌వారికి మంచి సమాజాన్ని అందించలాని మంత్రి కేటీఆర్ ని కోరుతూ ఈషా ట్వీట్ చేసింది.

కాగా ఈషా ట్వీట్‌ చూసిన మంత్రి కేటీఆర్ వెంటనే ఆమెకు రిప్లే ఇచ్చారు. ‘అధికారికంగా చ‌ట్ట‌ప్ర‌కారంగా నిషేధించినంత మాత్రన ప్లాస్టిక్ ని పూర్తిగా బ్యాన్ చేయలేమని, ప్లాస్టిక్ నిషేధం పై అధికారులకు, ప్ర‌జ‌లకు, ప్లాస్టిక్ తయారీదారుల‌కు అవ‌గాహ‌న క‌లగాలి, అప్పుడే ప్లాస్టిక్ పూర్తిగా నిషేధంపబడుతుంది’ అంటూ మంత్రి కేటీఆర్ ఈషా రెబ్బకి రిట్వీట్ చేశారు. తనకి ఇంత త్వ‌ర‌గా కేటీఆర్ స్పందించ‌డంతో ఈషా సంతోషానికి అవధులు లేకుండా పోయింది. ‘నా ట్వీట్ కి ఇంత త్వ‌ర‌గా రిప్లే ఇచ్చినంద‌కు మీకు ప్రత్యేకమైన ధ‌న్య‌వాదాలు స‌ర్‌. మీ లాంటి ప్ర‌తిభావంత‌మైన యువ‌నాయ‌కులు మన రాష్ట్రానికి ఉన్నప్పుడు అది అసాధ్యం అనేది అపోహ మాత్రమే. ప్లాస్టిక్ నిషేధంలో మన తెలంగాణ రాష్ట్రాన్ని మీరు ముందువరుసలో ఉంచాలని కోర‌ుకుంటున్నాను’’ అని ఈ తెలుగు హీరోయిన్ మళ్ళీ ట్వీట్ చేసింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు