డిఫరెంట్ పాత్రలను సృష్టించి, వాటికి ఓ చిత్రమైన స్క్రీన్‌ప్లే ని జోడించి సినిమాలు తీసి తెలుగులో టాప్ డైరెక్టర్‌లలో ఒకరుగా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ సుకుమార్ నిర్మాతగా వినూత్న సినిమాలను తెరకెక్కించాలని నిర్ణయించుకున్నాడు. అనుకోవడమే తడవుగా సుకుమార్ తన సొంత బ్యానర్‌పై ‘కుమారి 21F’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సుకుమార్ స్వయంగా కథ – స్క్రీన్‌ప్లే అందించి, పల్నాటి సూర్య ప్రతాప్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ చేసిన ఈ సినిమాలో వరుసగా రెండు హిట్స్ అందుకున్న రాజ్ తరుణ్ హీరోగా, హీబా పటేల్ హీరోయిన్‌గా కనిపించనున్నారు.
షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ టీజర్ ని ఇటీవలే ఎన్.టి.ఆర్ చేతుల మీదుగా లాంచ్ చేసారు. ఈ టీజర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా చివరి దశలో ఉన్న ఈ సినిమాని అక్టోబర్ 30న రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. దాంతో ఈ సినిమా ఆడియో రిలీజ్ కి కూడా డేట్ ని ఫైనలైజ్ చేసారు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఆడియోని అక్టోబర్ 24న రిలీజ్ చేయనున్నారు. సుకుమార్ స్టైల్ నెరేషన్‌తో ఓ సరికొత్త ప్రేమకథగా ఈ సినిమా రూపొందిన ఈ సినిమాకి రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసాడు.


