ఇక వారి ఆశలన్నీ మెగాస్టార్ ‘కాకా’పైనే..!

ఇక వారి ఆశలన్నీ మెగాస్టార్ ‘కాకా’పైనే..!

Published on Aug 31, 2026 11:07 PM IST

భారీ ప్రాజెక్టులతో దక్షిణాది సినీ రంగంలోకి వచ్చిన ‘కేవిఎన్ ప్రోడక్షన్స్’కు వరుస ఎదురుదెబ్బలు తగిలాయి. ధృవ సర్జా ‘కెడి ది డెవిల్’, విజయ్ ‘జన నాయగన్’ చిత్రాలు ఆశించిన విజయాన్ని సాధించలేక పోయాయి. అయితే, రాకింగ్ స్టార్ యష్ నటించిన ‘టాక్సిక్’ చిత్రంపై వారు బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు.

కానీ, ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది. ఈ వరుస సెట్‌బ్యాక్‌ల తర్వాత ప్రొడక్షన్ హౌస్‌కు ఊరటనిచ్చే ఏకైక ప్రాజెక్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో వస్తున్న ‘కాకా’ నిలిచింది. సంక్రాంతి రేసులో వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద క్లిక్ అయితే, కేవిఎన్ ప్రోడక్షన్స్ మళ్లీ పూర్వ వైభవాన్ని పుంజుకునే అవకాశం ఉంది.

ఇక ‘కాకా’ చిత్రంలో మెగాస్టార్ ఓ సరికొత్త మేకోవర్‌తో కనిపిస్తుండగా ఈ చిత్రంలో అనశ్వర రాజన్ చిరు కూతురి పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా సంక్రాంతి కానుకగా 2027 జనవరి 13న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. మరి ‘కాకా’ కేవిఎన్ ఫెయిల్యూర్ ట్రాక్‌కు బ్రేక్ వేస్తాడేమో చూడాలి.

తాజా వార్తలు