కోలీవుడ్‌కు చెందిన కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ ప్రస్తుతం రెండు భారీ చిత్రాలను రూపొందిస్తోంది. ఈ బ్యానర్ నుంచి కేజీయఫ్ హీరో యష్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘టాక్సిక్’తో పాటు.. తమిళ స్టార్ హీరో విజయ్ లాస్ట్ చిత్రంగా ‘జన నాయగన్’ సినిమాలను ఈ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక ఈ రెండు సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ తమ సత్తా చాటేందుకు సిద్ధమవుతుంది.
అయితే, ఇప్పుడు ఈ ప్రెస్టీజియస్ బ్యానర్ తెలుగు ఇండస్ట్రీలోకి కూడా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యింది. డైరెక్టర్ బాబీ చేయబోయే నెక్స్ట్ చిత్రాన్ని తమ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తున్నట్లు నిర్మాతలు తాజాగా ప్రకటించారు. దీంతో బాబీ చేయబోయే నెక్స్ట్ చిత్రం ఎవరిదా అని అందరూ ఆరా తీస్తున్నారు. కాగా, బాబీ తన నెక్స్ట్ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవితో చేయబోతున్నట్లు ఇప్పటికే తెలిపారు.
దీంతో కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ ఈ మెగా ప్రాజెక్ట్‌తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇక ఈ సినిమాను బాబీ మరోసారి తనదైన మార్క్ ఎంటర్టైనర్‌గా రూపొందించనున్నాడు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందించబోతున్నట్లు తెలుస్తోంది.


