స్టార్ హీరోయిన్ పెళ్ళికి ముహూర్తం ఫిక్స్ ?

Published on Sep 19, 2021 7:11 pm IST

సౌత్ ఇండస్ట్రీలో ఏ స్టార్ హీరోయిన్ కు లేని విధంగా లేడీ సూపర్ స్టార్ నయనతార వ్యక్తిగత జీవితం ఎప్పుడూ వార్తల్లో నిలవడం ఒక ఆనవాయితీ అయిపోయింది. దీనికి తోడు నయనతార కూడా ఏమి చేసినా ఓపెన్ గా చేసుకుంటూ పోతుంది. ఇక నిన్న తనకు కాబోయే భర్త డైరెక్టర్ విఘ్నేష్ శివన్ పుట్టినరోజు. దాంతో అతని పుట్టినరోజును గ్రాండ్ గా జరిపించింది. ఈ సందర్భంగా విఘ్నేష్ శివన్ కి అదిరిపోయే బర్త్ డే పార్టీ కూడా ఇచ్చిందట. ఈ బర్త్ డే ఫోటోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.

ఇక ఇప్పటికే ఈ జంట ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. ప్రస్తుతం విఘ్నేష్ శివన్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్న నయనతార తమ ప్రేమాయణానికి ముగింపు పలికి, దాంపత్య బంధానికి స్వాగతం పలకాలని ఒక ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకుందని తెలుస్తోంది. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న కేరళలోని ఓ చర్చలో ఈ జోడీ వివాహం జరగబోతుందట. ఏది ఏమైనా ఎప్పటినుండో నయనతార పెళ్లి రూమర్లు హల్ చల్ చేస్తూనే ఉన్నాయి.

సంబంధిత సమాచారం :