రజనీ సరసన నయనతార ?

రజనీ సరసన నయనతార ?

Published on Mar 29, 2018 9:51 AM IST

సూపర్ స్టార్ రజనీకాంత్ తన తర్వాతి సినిమాను యువ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ తో చేయనున్న సంగతి తెలిసిందే. కళానిధి మారన్ ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ పతాకంపై భారీ బడ్జెట్ తో రూపొందించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.

ఈ పనుల్లో భాగంగా రజనీ సరసన కథానాయికను ఎంపిక చేసే పనుల్లో తలమునకలై ఉన్నారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే త్రిష, అంజలి, దీపికా పదుకొనె వంటి హీరోయిన్ల పేర్లు వినిపిస్తుండగా ఇప్పుడు ఆ జాబితాలోకి లేడీ సూపర్ స్టార్ నయనతార పేరు కూడ చేరింది. నయనతార గతంలో రజనీతో కలిసి ‘చంద్రముఖి, కుసెలన్’ వంటి సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఈ నలుగురిలో ఎవర్ని ఫైనల్ చేస్తారనే సంగతి ఇంకో వారం పది రోజుల్లో తేలిపోనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు