సమీక్ష : లక్ష్మి – డ్యాన్స్ ను అభిమానించే వారికి మాత్రమే

Published on Aug 25, 2018 11:44 am IST

విడుదల తేదీ : ఆగష్టు 24, 2018
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు :  దిత్యా, ప్రభుదేవా , ఐశ్వర్యా రాజేష్ , సత్యం రాజేష్

దర్శకత్వం : ఎ ఎల్ విజయ్

నిర్మాతలు : ప్రమోద్ ఫిలిమ్స్ ట్రైడెంట్ ఆర్ట్స్

సంగీతం : సామ్ సి ఎస్

సినిమాటోగ్రఫర్ : నిరవ్ షా

ఎడిటర్ :ఆంథోనీ

దిత్యా , ప్రభుదేవా ప్రధాన పాత్రల్లో తమిళ దర్శకుడు ఎ ఎల్ విజయ్ డ్యాన్స్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘లక్ష్మి’. ఈరోజు ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా వుందో ఇప్పుడు చూద్దాం .

కథ :

లక్ష్మి కి డ్యాన్స్ అంటే ప్రాణం. అయితే వాళ్ళ అమ్మ నందిని (ఐశ్వర్య రాజేష్) కి గతంలో జరిగిన అనుభవం వల్ల ఆమెకు లక్ష్మి డ్యాన్స్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు. దాంతో లక్ష్మి , నందిని కి తెలియకుండా వీలుదొరికినప్పుడల్ల ఎక్కడపడితే అక్కడ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ప్రైడ్ అఫ్ ఇండియా జూనియర్స్ అనే కాంటెస్ట్ స్టార్ట్ అవుతుంది. ఈ షో లో లక్ష్మి ఎలాగైనా పాల్గొనాలి అనుకుంటున్నా క్రమంలో ఆమెకు కృష్ణ (ప్రభుదేవా) సాయం చేస్తాడు. అసలు కృష్ణ ఎవరు? ఆయనకు లక్ష్మి తల్లి నందినికి వున్నా సంభందం ఏమిటి? లక్ష్మి కోసం కృష్ణ ఏం చేశాడు ? ప్రైడ్ అఫ్ ఇండియా కాంటెస్ట్ లో లక్ష్మి గెలుస్తుందా? అనేదే మిగితా కథ.

ప్లస్ పాయింట్స్ :

డ్యాన్స్ నేపథ్యంలో జరిగే ఈ స్టోరీ కి దిత్యా ప్రధాన ఆకర్షణ గా నిలిచింది. తన డ్యాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడం మాత్రమే కాకుండా నటన తోను మెప్పించింది. ఇదే మొదటి సినిమా అయినా అనుభవం వున్నా అమ్మాయిలా అద్భుతంగా నటించింది. ఇక కోచ్ పాత్రలో ప్రభుదేవా పాత్ర ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఆయన ఈ వయసులోకూడా తన స్టెప్స్ తో ప్రేక్షకులను మరో సారి ఫిదా చేశారు. ఇక కొరియోగ్రాఫర్స్ రుయల్, పరేష్ రూపొందించిన నృత్యాలు ప్రేక్షకులను అలరిస్తాయి. ముఖ్యం గా 5నిమిషాలపాటు సాంగ్ , మ్యూజిక్ లేకుండా కంపోజ్ చేసిన డ్యాన్స్ సినిమాకు హైలైట్ గా నిలిచింది.

స్టేజి ఫియర్ తో లక్ష్మి బాధపడుతుంటే తన భయాన్ని పోగొట్టే సీన్ కూడా చాలా బాగా చూపెట్టారు. లక్ష్మి అమ్మ పాత్రలో నటించిన ఐశ్వర్య రాజేష్ తన పాత్రా మేర చక్కగా నటించారు. ఇక దర్శకుడు సింపుల్ కథకు తన అనుభవాన్ని జోడించి ఎక్కడా తడబడకుండా చాలా బాగా తెరకెక్కించారు.

మైనస్ పాయింట్స్ :

ఈ స్టోరీ చాలా సింపుల్ కావడంతో ఎక్కడ ఆసక్తికర ట్విస్ట్ లు కనపడవు. చివర్లో వచ్చే ట్విస్ట్ బాగున్నా ప్రేక్షకులు అంతగా కనెక్ట్ అవ్వరు. సినిమా ఆద్యంతం డ్యాన్స్ లు తప్ప వేరే కమర్షియల్ అంశాలు ఎక్కువగా లేకపోవడం నిరాశ కలిగిస్తుంది. సినిమాలో కోవై సరళ , సత్యం రాజేష్ లాంటికమెడియన్స్ వున్నావారిని సరిగ్గా వాడుకోలేదు.

ఇక ఫస్ట్ హాఫ్ సాగినంత స్పీడ్ గా సెకండ్ హాఫ్ ఉండదు. సెకండ్ హాఫ్ లో వచ్చే సన్నివేశాలు కొంచెం సాగదీసినట్టుగా అనిపిస్తాయి. ఇక ఈ చిత్రం తమిళ భాషలో తెరకెక్కడం వల్ల తెలుగు డబ్బింగ్ కూడా అంత పర్ఫెక్ట్ గా కుదర్లేదు.

సాంకేతిక వర్గం :

ఎ ఎల్ విజయ్ సింపుల్ కథ ను తీసుకొని దానికి కొన్ని ట్విస్టులు జోడించి ఎలాంటి తడబాటు లేకుండా తెరకెక్కించాడు. ఆయన అనుకున్నది అనుకున్నట్టుగా తెర మీద చూపెట్టడంలో చాలా వరకు సఫలం అయ్యాడు. ఈ చిత్రానికి సంగీతం అందించిన సామ్ సి ఎస్ పనితనం బాగుంది. పాటలు ,బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఆకట్టుకున్నాడు.

తీర్పు :

లక్ష్మి రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా ఆద్యంతం ఆకట్టుకునే డ్యాన్స్ లతో తెరకెక్కింది. లక్ష్మి అనే అమ్మాయి కథతో తెరకెక్కిన ఈచిత్రంలో ప్రభుదేవా, దిత్యా ల నటన, డ్యాన్స్ లు చిత్రానికి హైలైట్ అవ్వగా ఎలాంటి ఆసక్తికరమైన మలుపులు లేకుండా సాగడం మైనస్ పాయింట్ గా చెప్పవచ్చు. చివరగా ఈచిత్రం డ్యాన్స్ ను ప్రేమించే వారికీ అమితంగా నచ్చుతుంది.

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :

More