‘లక్ష్మీస్..’కి చెప్పినట్టే జరిగింది !

‘లక్ష్మీస్..’కి చెప్పినట్టే జరిగింది !

Published on Mar 19, 2019 5:08 PM IST

రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్‌ విషయంలో సెన్సార్ బోర్డుతో కలిగిన ఇబ్బందులు పరిష్కరించునున్నాయని.. సెన్సార్ బోర్డు నుండి అన్ని అడ్డంకులు క్లియర్ అవుతున్నాయని.. కాకపోతే విడుదల తేదీ మార్చి 22 న కాకుండా, మార్చి 29వ తేదికి వాయిదా పడబోతుందని.. నిన్న మేం చెప్పిన విషయం తెలిసిందే. కాగా చెప్పినట్లుగానే ఈ చిత్రం సెన్సార్ సర్టిఫికేట్ పొందనుంది. అలాగే మార్చి 29వ తేదికి ఈ చిత్రం వాయిదా పడింది.

ఇక తెలంగాణ హైకోర్టు కూడా ఈ సినిమా విడుదలకు అనుమతి ఇచ్చింది. అయితే ఈ చిత్రంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును విలన్ గా చూపించడం.. పైగా సినిమాను ఎన్నికల సమయంలో విడుదల చేయాలనుకోవడంతో ఈ సినిమాను అడ్డుకోవాలని తెలుగు తమ్ముళ్లు తెగ ప్రయత్నిస్తున్నారు. మరి ఎంతవరకు అడ్డుకోగలరో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు