లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలతేది ఖరారు !

Published on Feb 28, 2019 3:15 pm IST

ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఈచిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ప్రపంచ వ్యాప్తంగా మార్చి 22 న గ్రాండ్ గా విడుదలకానుంది. ఇక ఇటీవల ఈ చిత్రం యొక్క ట్రైలర్ ను విడుదలచేయగా అనూహ్యమైన రెస్పాన్స్ ను రాబట్టుకొని సినిమా ఫై అంచనాలను పెంచింది. ఎన్టీఆర్ జీవితం లోకి లక్ష్మి పార్వతి ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిందిఈ చిత్రం .

కాగా ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి వస్తున్న వార్తలు నమ్మొద్దని డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఇంకా ఎవరికి ఇవ్వలేదని ఈ చిత్ర నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. కళ్యాణి కోడూరి సంగీతం అందించిన ఈ చిత్రాన్ని రాకేష్ రెడ్డి మరియు దీప్తి బాలగిరి సంయుక్తంగా నిర్మించారు.

సంబంధిత సమాచారం :