చివరికీ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను ఏం చేస్తాడో.. ?

Published on Mar 24, 2019 12:57 pm IST

రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ కు జరిగిన వెన్నుపోటు ఘట్టాన్ని ప్రధానాంశంగా తీసుకుని తీసిన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. మార్చి 29నే ఈ సినిమా విడుదల అంటూ వర్మ హడావుడి అయితే చేస్తున్నాడు గాని.. ఇంతవరకూ ఈ సినిమాకు సెన్సారే కాలేదు. పైగా సెన్సార్ సభ్యులు సినిమా చూశాక ఏమి చెబుతారో ఎన్ని కట్స్ చెబుతారో అనేది మరో లెక్క.. మొత్తానికి వర్మ సినిమాకి హైప్ అయితే తెచ్చాడు గాని.. ఆ హైప్ నిలబడాలంటే సినిమా అనుకున్న తేదీకే రిలీజ్ అవ్వాలి.

అయితే సెన్సార్ రెండుమూడు రోజుల్లో పూర్తి అవుతుందని… అనుకున్న తేదీ ప్రకారమే సినిమాను రిలీజ్ చేస్తున్నామని చిత్రబృందం చెప్పిందే చెప్తూ ఉంది, అయినా సినిమా రిలీజ్ అయ్యేదాకా ప్రేక్షకుల్లో ఎక్కడో అనుమానం. ముఖ్యంగా ఈ చిత్రంలో చంద్రబాబును డైరెక్ట్ గా విలన్ గా చూపించడం.. పైగా సినిమాను ఎన్నికల సమయంలో విడుదల చేయాలనుకోవడంతో ఈ సినిమాను అడ్డుకోవాలని తెలుగు తమ్ముళ్లు తెగ ప్రయత్నిస్తున్నారు.

మరి చివరికి లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల అవుతాడా ? లేక ఎన్నికల తరువాతకి పోస్ట్ ఫోన్ అవుతాడా ? ఒకవేళ ఎన్నికలకు తరువాత గాని రిలీజ్ అయితే సినిమా పై ప్రజలకు ఆసక్తి కూడా తగ్గిపోతుంది. మరి చివరికీ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను వర్మ ఏం చేస్తాడో… చూడాలి.

సంబంధిత సమాచారం :