సెన్సార్ బోర్డు పై కేసు పెడతా – ఆర్జీవీ

Published on Mar 17, 2019 3:50 pm IST

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పేరుతొ ఎన్టీఆర్ కు జరిగిన వెన్నుపోటు ఘట్టాన్ని ప్రధానాంశంగా తీసుకుని సినిమా తియ్యడం.. ఆ సినిమాలో కాస్త అధికారంలో ఉన్న ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిని విలన్ గా చూపించడం.. పైగా సినిమాను ఎన్నికల సమయంలో విడుదల చేయాలనుకోవడం.. మొత్తానికి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా వివాదానికి మించిన రాజకీయ దురుద్దేశ్యం ఉందని సెన్సార్ బోర్డు భావిస్తోంది.

కాగా ఈ సినిమాకు ఇవ్వాల్సిన సెన్సార్ సర్టిఫికెట్‌ విషయంలో సెన్సార్ బోర్డు కావాలని తమను ఇబ్బందులు గురిచేస్తోందని రామ్ గోపాల్ వర్మ తెలియజేసారు. అందుకే సెన్సార్ బోర్డు పై తానూ కేసు పెడుతున్నట్లుగా ఆయన వెల్లడించారు. ఇంతకీ అసలు విషయంలోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లో తొలిదశ పోలింగ్ పూర్తయ్యేవరకూ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా సెన్సార్‌ ను వాయిదా వేస్తున్నామని సెన్సార్ బోర్డు తెలియజేసింది.

దాంతో ఆర్జీవీ ఈ విషయం గురించి స్పందిస్తూ.. ‘ఒక సినిమాకు సెన్సార్ సర్టిఫికేషన్ ఇవ్వడాన్ని ఇష్టమొచ్చినట్లు వాయిదా వేసే అధికారం సెన్సార్ బోర్డుకు లేదని.. చట్ట విరుద్ధంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను అడ్డుకునేందుకు సెన్సార్ బోర్డు ప్రయత్నిస్తోందని..ఆర్జీవీ ఆరోపించారు. అందుకే తానూ సెన్సార్ బోర్డు పై కేసు పెడుతున్నట్లుగా సోషల్ మీడియా వేదికగా ఆయన వెల్లడించారు.

సంబంధిత సమాచారం :