‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ తెలంగాణలో రిలీజ్ కానుంది !

Published on Mar 28, 2019 10:37 pm IST

రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ కు జరిగిన వెన్నుపోటు ఘట్టాన్ని ప్రధానాంశంగా తీసుకుని తీసిన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. కాగా ఈ నెల 29న ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలని చిత్రబృందం రెడీ అయింది. అయితే ఈ చిత్రం విడుదల ఆపాలని ఏపీ హైకోర్టు స్టే విధించింది.

ఏపీలో జరిగే ఎన్నికలు పూర్తయ్యే దాకా సినిమాను థియేటర్స్ తో పాటు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో కూడా ఈ చిత్రాన్ని ప్రదర్శించ రాదని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ఈ స్టే కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యేలా ఉంది. ఎందుకంటే లక్ష్మీస్ ఎన్టీఆర్ తెలంగాణలో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

More