జీవితంలో ఎన్టీఆర్ చేసిన ఒకే ఒక్క తప్పు !

జీవితంలో ఎన్టీఆర్ చేసిన ఒకే ఒక్క తప్పు !

Published on Feb 14, 2019 3:20 PM IST

రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నుండి విడుదల చేసిన వెన్నుపోటు పాటతోనే తెలుగు తమ్ముళ్ల మనోభావాలను కెలికాడు. ఇప్పుడు తాజాగా విడుదల చేసిన ట్రైలర్ తో మళ్ళీ వివాదాలకు పునాది తీశాడు. ప్రస్తుతం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ట్రైలర్ లో ఎన్టీఆర్ ని హైలెట్ చేసినా.. ప్రధానంగా చంద్రబాబునే టార్గెట్ చేశాడు వర్మ.

ఎన్టీఆర్ తన జీవితంలో చేసిన ఒకే ఒక్క తప్పు చంద్రబాబుని నమ్మడం అని ఎన్టీఆర్ పాత్రే చెప్పించడం, అలాగే హరికృష్ణ పాత్ర చేత ‘మీకు ఆడ తోడు కావాలంటే’ లాంటి డైలాగ్ చెప్పించడం కూడా తెలుగు తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ట్రైలర్ మాత్రం సినిమా పై అంచనాలు పెంచుతుంది. నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.

ఇంకా సినిమాలో ఎలాంటి అంశాలను చూపించనున్నారో అనే ఆసక్తిని పెంచడంలో మాత్రం వర్మ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఇక ఈ సినిమాను మార్చిలో విడుదల చేయబోతున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్రీ తేజ్, చంద్ర బాబు నాయుడు పాత్రలో నటిస్తుండగా.. ప్రముఖ కన్నడ నటి యజ్ఞ శెట్టి లక్ష్మీ పార్వతి పాత్రలో కనిపించనుంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు