‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదల తేదీ అదేనా !

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదల తేదీ అదేనా !

Published on Feb 28, 2019 4:02 AM IST


రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’తో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగానే హడావుడి చేస్తున్నాడు. ఇప్పటికే లక్ష్మీస్ ఎన్టీఆర్ నుండి విడుదల చేసిన వెన్నుపోటు పాటతోనే తెలుగు తమ్ముళ్ల మనోభావాలను కెలికాడు వర్మ. ఆ తరువాత టీజర్, ట్రైలర్ లతో వివాదాలకు బాగానే పునాది తీశాడు. అంతటితో ఆగని వర్మ సోషల్ మీడియాలో కూడా కామెంట్స్ చేస్తూ సినిమాకి బాగానే హైప్ క్రియేట్ చేస్తున్నాడు.

కాగా తాజా సమాచారం ప్రకారం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మార్చి 15వ తేదీన విడుదల కాబోతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్రీ తేజ్, చంద్ర బాబు నాయుడు పాత్రలో నటిస్తుండగా.. ‘కిల్లింగ్ వీరప్పన్’ సినిమాలో నటించిన ప్రముఖ కన్నడ నటి యజ్ఞ శెట్టి లక్ష్మీ పార్వతి పాత్రలో నటిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు