“లాలా భీమ్లా” పై పెరుగుతున్న అంచనాలు… ప్రోమో విడుదల కి సిద్దం!

Published on Nov 3, 2021 12:00 pm IST

పవన్ కళ్యాణ్ హీరోగా సాగర్ కే చంద్ర దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం భీమ్లా నాయక్. ఈ చిత్రం లో రానా దగ్గుపాటి మరొక హీరో పాత్ర లో నటిస్తున్నారు. మలయాళ సూపర్ హిట్ చిత్రం అయిన అయ్యప్పనుం కోషీయం చిత్రానికి ఇది రీమేక్ గా తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎంటర్ అవ్వడం తో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, విడియోలు, పాటలు సినిమా పై మరింత ఆసక్తి ను పెంచేశాయి. తాజాగా ఈ చిత్రం నుండి లాలా భీమ్లా పాటను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. తాజాగా ఈ చిత్రం నుండి మరొక పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది. లాలా భీమ్లా పాటకు సంబందించిన ప్రోమో ను నేడు సాయంత్రం 7:02 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించడం జరిగింది.

పవన్ కళ్యాణ్, రానా దగ్గుపాటి లు ఇద్దరు కూడా మాస్ హీరోలు అవ్వడం తో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దింపేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :

More