‘ఆటోనగర్ సూర్య’కి చివరి 25నిమిషాలు మేజర్ హైలైట్ – దిల్ రాజు

‘ఆటోనగర్ సూర్య’కి చివరి 25నిమిషాలు మేజర్ హైలైట్ – దిల్ రాజు

Published on Jun 26, 2014 12:58 PM IST

dill-raju
నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఆటోనగర్ సూర్య’ అన్ని అవాంతరాలను తొలగించుకొని రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. అనూప్ రూబెన్స్ అందించిన ఈ సినిమా ఆడియోకి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ రోజు ఉదయం ఈ చిత్ర ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేసారు. ఈ కార్యక్రమంలో నాగ చైతన్య, దేవకట్టా, దిల్ రాజు, అచ్చి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

దేవకట్టా మాట్లాడుతూ ‘అన్ని అవాంతరాలను తన అనుభవంతో క్లియర్ చేసి సినిమాని రేపు రిలీజ్ చేయడానికి అన్ని విధాల కృషి చేసిన దిల్ రాజు గారికి నా ప్రత్యేక కృతఙ్ఞతలు. నా కాన్సెప్ట్ ని నమ్మి బాగా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేసిన ఈ చిత్ర ప్రొడక్షన్ టీంకి నా ధన్యవాదాలు’ అని అన్నాడు.

నాగ చైతన్య మాట్లాడుతూ ‘ఈ సినిమా రిలీజ్ కి ఎంతో కష్టపడిన ఫైనాన్సియర్స్, దిల్ రాజుకి నా స్పెషల్ థాంక్స్. ఆలస్యం అయినా సరైన సమయానికే ఈ సినిమా వస్తోంది. దేవకట్టా చాలా బాగా తీసాడు. కచ్చితంగా ఈ మూవీ హిట్ అవుతుందని’ అన్నాడు.

దిల్ రాజు మాట్లాడుతూ ‘ఈ సినిమాకి కమిట్ అయినప్పుడు నేను సినిమా చూడలేదు. సినిమా చూడకుండా కమిట్ అయ్యాను అనే చిన్న టెన్షన్ వల్ల సినిమా షో వేయమంటే రెండు రోజులు టైం తీసుకొని నాకు షో వేసారు. చాలా మంచి మూవీ, కచ్చితంగా సూపర్ హిట్ మూవీ. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమా 27న రిలీజ్ చేయాలని నా వంతు కృషి నేను చేసాను. నా సొంత సినిమాకి కూడా ఎప్పుడు ఇలా కష్టపడలేదు. ముందు చెప్పిన టైంకే సినిమా రేపు రిలీజ్ అవుతోంది. నాగ చైతన్య పెర్ఫార్మన్స్, దేవకట్టా డైరెక్షన్ మరియు చివరి 25 నిమిషాలు ఈ సినిమాకి మేజర్ హైలైట్స్. ఆటోనగర్ సూర్య పక్కా డైరెక్టర్స్ మూవీ అని’ అన్నాడు.

తాజా వార్తలు