బహుముఖ ప్రజ్ఞ విజయ నిర్మల విగ్రహావిష్కరణ

Published on Feb 20, 2020 12:32 pm IST

నేడు దర్శకనిర్మాత మరియు నటి విజయ నిర్మల జయంతిని పురస్కరించుకొని ఆమె విగ్రహాన్ని ఆవిష్కరించారు. హైదరాబాద్ నానక్ రామ్ గూడాలో గల ఆమె స్వగృహం నందు ఉదయం 9గంటల నుండి ఈ కార్యక్రమం జరిగింది. చిత్ర ప్రముఖులతో పాటు భర్త కృష్ణ, కుమారుడు నరేష్,మహేష్ బాబు,మురళి మోహన్,కృష్ణం రాజు, మారుతీ ఇంకా అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సంధర్భంగా చిత్ర పరిశ్రమకు ఆమె అందించిన సేవలను కొనియాడారు.

విజయ నిర్మల గత ఏడాది హఠాన్మరణం పొందారు. జూన్ 27,2019 న హార్ట్ అటాక్ కారణంగా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమె తుది శ్వాస విడిచారు. నటిగా తెలుగు, తమిళ మరియు మలయాళ భాషలలో నటించిన విజయ నిర్మల లేడీ డైరెక్టర్ గా 44చిత్రాలు నిర్మించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో పేరు సంపాదించారు. చిత్ర పరిశ్రమకు ఆమె అందించిన సేవలకు గుర్తుగా ఆమెను రఘుపతి వెంకయ్య అవార్డుతో సత్కరించడం జరిగింది.

సంబంధిత సమాచారం :