లేటెస్ట్.. సత్యరాజ్ ఆరోగ్యం పట్ల గుడ్ న్యూస్.!

Published on Jan 11, 2022 9:00 am IST


మన సౌత్ ఇండియన్ సినిమా దగ్గర అనేక ఆసక్తికర సినిమాల్లో నటించిన ప్రముఖ సీనియర్ నటుడు సత్య రాజ్ ఇటీవల కరోనా బారిన పడిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే చెన్నై లో చికిత్స పొందుతున్న ఈ విలక్షణ నటుడు ఆరోగ్యం మధ్యలో కాస్త క్షీణించినట్టు టాక్ వచ్చినా ఇప్పుడు మాత్రం ఆయన ఆరోగ్యానికి సంబంధించి ఒక మంచి వార్తే బయటకి వచ్చిందని చెప్పాలి.

ప్రస్తుతం సత్య రాజ్ కరోనా నుంచి త్వరగానే పూర్తిగా కోలుకున్నారట. అంతే కాకుండా ఈరోజే కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కూడా అయ్యారట. మరి ఇది ఈ క్లిష్ట సమయాల్లో ఒక మంచి వార్తే అని చెప్పాలి.

అంతా ఇప్పుడు కాస్త ఆందోళనలో ఉన్నారు, కేసులు అయితే పెరుగుతున్నాయి కానీ అంతా వ్యాక్సినేషన్ చేసుకోవడం మూలాన ప్రాణ నష్టం అయితే ఈసారి అంతగా లేదని అర్ధం అవుతుంది. మొత్తానికి మాత్రం సత్యరాజ్ కోలుకోవడం అందరికీ ఆనందంగా ఉంది. ఇక రీసెంట్ గా అయితే సత్య రాజ్ ప్రభాస్ భారీ సినిమా రాధే శ్యామ్ లో కనిపించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :