ఈ సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో రిలీజ్ కి వస్తున్న అవైటెడ్ చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి అలాగే హీరోయిన్ నయనతార హీరోయిన్ గా వెంకీ మామ కీలక పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం “మన శంకర వరప్రసాద్ గారు” (Mana Shankara Vara Prasad Garu) కూడా ఒకటి. బ్లాక్ బస్టర్ దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూసేందుకు మెగా అభిమానులు ఫ్యామిలీ ఆడియెన్స్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు.
ఇక ఈ సినిమా కోసం చూస్తున్న ఫ్యాన్స్ కి ఈ సినిమా తోనే ఒక సంచలన ఇనీషియేషన్ మొదలు కావడం అనేది చర్చకి దారి తీసింది. ఇది వరకు ప్రతీ సినిమాకి ఆన్లైన్ బుకింగ్ ప్లాట్ ఫామ్ లలో రివ్యూస్ అండ్ రేటింగ్స్ ఇచ్చే వెసులుబాటు ఉండేది. కానీ అది వాంటెడ్ గా కూడా మారిపోయింది. చాలా మంది సినిమా చూడకుండానే రేటింగ్స్ ఇవ్వడం, కామెంట్స్ చేయడం వంటివి జరిగాయి.
వాటి తర్వాత కేవలం సదరు యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఆ పెట్టాలి అన్నట్టు తెలిపారు. కానీ అది కూడా మానిప్యులేట్ చేయొచ్చని తర్వాత తెలిసింది. ఇక ఫైనల్ గా వీటి అన్నిటికి ఒక ఎండ్ కార్డు పడింది. అది కూడా మన శంకర వరప్రసాద్ గారితో మొదలైంది. ఇటీవల కోలీవుడ్, కన్నడ ఇండస్ట్రీ లలో అక్కడి న్యాయస్థానం వారు క్లియర్ గా ఇక నుంచి ఆన్లైన్ బుకింగ్ యాప్స్ లో రేటింగ్ సిస్టం ఉండకూడదు అని సూచించారు.
అలాగే దర్శన్ నటించిన డెవిల్ సినిమా ఇటీవల విడుదల అయ్యింది. ఇక లేటెస్ట్ గా ఇదే సంచలన నిర్ణయం తెలుగు సినిమా పరిశ్రమకి కూడా వచ్చింది. మరి ఇది కూడా మెగాస్టార్ సినిమాతోనే మొదలు కావడం అనేది ఒకరకంగా మంచి విషయం. దీనితో మేకర్స్ కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ తమ సినిమాని రిలీజ్ కి తీసుకొస్తున్నారు.



