“RRR” సాలిడ్ టీజర్ పై మరో కేజ్రీ గాసిప్..!

“RRR” సాలిడ్ టీజర్ పై మరో కేజ్రీ గాసిప్..!

Published on Jan 6, 2021 8:01 AM IST

rrr

మన టాలీవుడ్ నుంచి వస్తున్న సాలిడ్ పాన్ ఇండియన్ చిత్రాల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో దర్శక ధీరుడు రాజా,పులి తెరకెక్కిస్తున్న భారీ పీరియాడిక్ వండర్ “రౌద్రం రణం రుధిరం” కూడా ఒకటి. అయితే ఈ చిత్రంలో తారక్ కొమరం భీం గా చరణ్ అల్లూరిగా కూడా కనిపిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ చిత్రం తాలుకా టీజర్ ను ఈ జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా మేకర్స్ విడుదల చెయ్యనున్నారు అని స్ట్రాంగ్ బజ్ ఈ మధ్యనే బయటకు వచ్చింది. ఇక దీనితో పాటుగా లేటెస్ట్ గాసిప్ మరొకటి వినిపిస్తుంది. ఈ సాలిడ్ టీజర్ కు గాను మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ అందించనున్నట్టుగా లేటెస్ట్ టాక్.

ఆ మధ్య ఈ చిత్రానికి ఆయా ఇండస్ట్రీల నుంచి పలువురు స్టార్ హీరోలు తమ గాత్రాన్ని ఇస్తున్నారని టాక్ వచ్చిన సంగతి కూడా తెలిసిందే. మరి అలానే ఇప్పుడు ఈ టీజర్ కు చిరు స్టార్ట్ చెయ్యనున్నారని అంటున్నారు. అయితే ఇది ఎంత వరకు నిజమో తేలాల్సి ఉంది.

ఎందుకంటే ఇలాంటివి ఏమన్నా ఉంటే జక్కన నుంచి కాస్త ముందే ప్రకటన వస్తుంది. మరి అలాంటిది ఇద్దరు హీరోల టీజర్ పై అంటే ఇంకా పక్కా ప్లానింగ్ ఉంటుంది. కానీ ఇంకా వారి నుంచి అలాంటివి ఇంకా ఏం స్టార్ట్ కాలేదు. మరి చూడాలి మున్ముందు ఏం జరగనుందో.

తాజా వార్తలు