‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 5’ పై ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ ఇన్ఫో.!

Published on Jul 15, 2021 8:01 am IST


మన తెలుగు టెలివిజన్ హిస్టరీలోనే కాకుండా వరల్డ్ టెలివిజన్ పైనే బిగ్గెస్ట్ రియాలిటీ షో ఏదన్నా ఉంది అంటే అది “బిగ్ బాస్” షో అనే చెప్పాలి. ప్రపంచ వ్యాప్తంగా కూడా అత్యంత పాపులారిటీ సంతరించుకున్న ఈ షో మన దేశంలో కూడా ప్రతీ భాషలోనూ హిట్టయ్యింది. కానీ మన దేశంలో మాత్రం అన్నిటికన్నా పెద్ద హిట్ గా నిలిచేది మాత్రం మన తెలుగులో షో అనే చెప్పాలి.

మొదటి ఎపిసోడ్ నుంచి లాస్ట్ ఫినాలే ఎపిసోడ్ వరకు మనవాళ్ళు భారీ రెస్పాన్స్ ను అందిస్తారు. మరి అలా ఇప్పటి వరకు నాలుగు సీజన్లకు సాలిడ్ రెస్పాన్స్ ఇచ్చిన తెలుగు ఆడియెన్స్ ఐదవ సీజన్ కోసం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి దీనిపై గత కొంత కాలం నుంచి పలు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

మరి లేటెస్ట్ గా మరో ఆసక్తికర ఇన్ఫో వినిపిస్తుంది. దీని ప్రకారం ఈ సీజన్ ఫస్ట్ టీజర్ కట్ వచ్చే నెలలో బయటకొచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే ఆల్రెడీ ఈ గ్రాండ్ షో సెట్ వర్క్ ప్రోగ్రెస్ లో ఉందని తెలిసిందే. ఇంకా హోస్ట్ పై అధికారిక క్లారిటీ కూడా త్వరలోనే ఛానెల్ వారు సరైన టైం చూసి రీవీల్ చేయనున్నారని తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :