“ఆచార్య” పై లేటెస్ట్ అప్డేట్ అండ్ రిలీజ్ పై కూడా.!

Published on Jun 23, 2021 4:00 pm IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ అండ్ భారీ బడ్జెట్ చిత్రం “ఆచార్య”. ఎన్నో అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రంలో మెగా తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తుండగా పూజా హెగ్డే చరణ్ సరసన నటిస్తుంది.

మరి ఇదిలా ఉండగా మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్రంపై లేటెస్ట్ అప్డేట్ తెలిసింది. వచ్చే జూలై మొదటి వారం నుంచే ఆచార్య షూట్ ను రీస్టార్ట్ చేయనున్నారట. అలాగే ఇదే షూట్ లో చిరు సహా చరణ్ లు ఇద్దరు కూడా పాల్గొననున్నారు. దాదాపు 20 రోజుల్లో ఈ చిత్రం షూట్ కంప్లీట్ అయ్యిపోనుందట.

మరి అలాగే దీనితో పాటు ఈ చిత్రం రిలీజ్ పై కూడా సమాచారం తెలుస్తుంది. మేకర్స్ ఈ చిత్రాన్ని అక్టోబర్ నెలలోనే విడుదల చెయ్యడానికి ఫిక్స్ అయ్యారట. సో ఈ సినిమా దసరా రేస్ లో నిలవడం కన్ఫర్మ్ అయ్యిందని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :