అడివి శేష్ మేజర్ చిత్రం పై లేటెస్ట్ బజ్!

Published on Jul 2, 2021 5:43 pm IST

అడివి శేష్ హీరోగా వస్తున్న సరికొత్త చిత్రం మేజర్. అయితే ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి అయిన సంగతి తెలిసిందే. చివరి షెడ్యూల్ ఇంకా జరగాల్సి ఉంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఒక కొత్త బజ్ ఏంటంటే, ఈ చిత్రం హిందీ శాటిలైట్ రైట్స్ ను ప్రముఖ సంస్థ పది కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇదే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అడివి శేష్ హీరోగా నటిస్తున్న మేజర్ చిత్రం 26/11 అటాక్స్ కి సంబంధించి రియల్ హీరో అయిన సందీప్ ఉన్నికృష్ణన్ కి సంబంధించినది. అయితే ఈ చిత్రం ను వీలైన త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే మహేష్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని GMB ఎంటర్టై్మెంట్ మరియు సోని పిక్చర్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లో సాయి మంజ్రేకర్ మరియు శోభిత ధూళిపాళ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :