కొరటాల శివతో సినిమా ఉంటుందన్న రామ్ చరణ్ !

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం ‘రంగస్థలం’ విడుదల పనుల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ హడావుడి పూర్తికాగానే ఆయన బోయపాటి శ్రీను సినిమా పనుల్లో బిజీ కానున్నారు. దసరాకు ఈ సినిమా విడుదలకానుంది. దాని తర్వాత రాజమౌళి, ఎన్టీఆర్ లతో కలిసి మల్టీస్టారర్ చేయనున్నాడు చరణ్.

ఈ సినిమాల తర్వాత ఎన్నాళ్ళ నుండో అనుకుంటున్నట్టు కొరటాల శివతో కూడ ఒక సినిమా చేస్తారట ఆయన. ఇటీవలే ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడిన చరణ్ కొరటాల శివతో సినిమా తప్పకుండా ఉంటుందని, అన్ని కుదిరాక వివరాల్ని వెల్లడిస్తానని అన్నారట. గతంలోనే వీరి కలయికలో సినిమా మొదలుకాగా సరైన స్క్రిప్ట్ కుదరక ఆగిపోయిన సంగతి తెలిసిందే.