“అఖండ” రిలీజ్ డేట్ పై లేటెస్ట్ బజ్.!

Published on Jun 20, 2021 5:30 pm IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న లేటెస్ట్ చిత్రం “అఖండ”. బాలయ్య మరియు బోయపాటి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడం అంచనాలను మించే రేంజ్ లోనే తెరకెక్కిస్తుండడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ సినిమా నుంచి ఇంకా సాలిడ్ అప్డేట్స్ రావాల్సి ఉండగా మరోపక్క సినిమా విడుదల పై కూడా పలు ఊహాగానాలు వినిపిస్తాయి. అయితే ఈ చిత్రం రిలీజ్ డేట్ పై లేటెస్ట్ టాక్ బయటకొచ్చింది. మరి దాని ప్రకారం ఈ చిత్రాన్ని మేకర్స్ సెప్టెంబర్ 10 న విడుదల చెయ్యాలని చూస్తున్నారట. అలాగే దీనిపై అధికారిక ప్రకటన కూడా రావచ్చని తెలుస్తుంది. మరి ఈ చిత్రం ఎప్పుడు విడుదల కానుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా ద్వారకా క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే..

సంబంధిత సమాచారం :