ఈ స్టైలిష్ డైరెక్టర్ తో అఖిల్ సినిమా.?

Published on Aug 11, 2020 10:14 am IST

అక్కినేని కాంపౌండ్ నుంచి వచ్చిన మరో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అఖిల్. తన మొదటికి సినిమాతోనే ఎనలేని క్రేజ్ ను సంతరించుకున్న అఖిల్ తనకంటూ ఒక స్పెషల్ క్రేజ్ ను తెచ్చుకున్నాడు. అది కూడా ఒక్క సరైన హిట్ కూడా పడకుండా. ఇప్పటి వరకు తాను చేసిన మూడు చిత్రాలు బాక్సాఫీస్ పరంగా సరైన విజయాన్ని నమోదు చేసుకోలేకపోయాయి.

అయినప్పటికీ తాను నటిస్తున్న నాలుగో చిత్రం “మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్” పై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఇదిలా ఉండగా ఈ యంగ్ హీరో మన టాలీవుడ్ లో స్టైలిష్ ఫిల్మ్ మేకర్ గా పేరు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయనున్నారని సరికొత్త టాక్ బయటకు వచ్చింది. ఇప్పటికే “సైరా” తర్వాత సురేందర్ రెడ్డి నెక్స్ట్ ప్రాజెక్ట్ పై చాలానే రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మా కాదా అన్నది తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :

More