బన్నీ మరో పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ బజ్.!

Published on Jun 15, 2021 7:02 am IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్ గా ఎస్టాబ్లిష్ అయ్యేందుకు సన్నద్ధం అవుతున్నాడు. తన హ్యాట్రిక్ అండ్ క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తో ప్లాన్ చేసిన భారీ పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప” తో అన్ని వర్గాల్లో కూడా గట్టిగానే కొట్టడానికి సన్నద్ధం అవుతున్న బన్నీ ఈ చిత్రం అనంతరం కూడా తన మరో భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ ను చెయ్యడానికి రెడీ అయ్యిపోయాడు.

అయితే మొదట పుష్ప రెండు పార్ట్స్ కంప్లీట్ చెయ్యాలి అనుకున్నా పలు కారణాల చేత తన అసలైన మొదటి పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ “ఐకాన్” రేస్ లోకి వచ్చింది. దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కించనున్న ఈ చిత్రానికి బన్నీ అభిమానుల్లో మంచి క్రేజ్ కూడా ఉంది. అయితే మరి ఈ చిత్రంపైనే లేటెస్ట్ బజ్ ఒకటి వినిపిస్తుంది.

ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ ను లాక్ చేయనున్నారని తెలుస్తుంది. అలాగే హీరోయిన్ ఎవరు అన్నది కూడా ఫైనల్ చేయనున్నట్టు టాక్.. మరి వీటిపై ఇంకా ఎలాంటి అధికారిక క్లారిటీ లేకపోయినా ఈ బజ్ అయితే బయటకి వచ్చింది. మరి ఇది ఎంత వరకు నిజమవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :