“అఖండ” ఫస్ట్ సింగిల్ ఇక అప్పుడే ఏమో.!

Published on May 29, 2021 9:00 am IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “అఖండ”. బాలయ్య మరియు బోయపాటి కాంబోలో వస్తున్న మూడో చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలు కూడా నెలకొన్నాయి. మరి ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రతీ అప్డేట్ కూడా బాలయ్య ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ఇచ్చింది.

అయితే వాటితో పాటుగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ కోసం వారు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అది కాస్తా నిన్న మే 28న విడుదల అవుతుందని స్ట్రాంగ్ బజ్ వినిపించింది. కానీ అది కాస్తా రాలేదు. మరి ఈ మోస్ట్ అవైటెడ్ ఫస్ట్ సింగిల్ వచ్చే జూన్ 10కే షిఫ్ట్ అయ్యిందా అనుకోవచ్చు.

ఎందుకంటే అప్పుడు బాలయ్య పుట్టినరోజు సందర్భంగా విడుదల అవుతుందేమో చూడాలి. అలాగే అదే రోజున మరో టీజర్ కూడా వస్తుందని టాక్ ఉంది. మరి ఆరోజున ఏ అప్డేట్ రానుందో చూడాలి. మరి ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా ద్వారకా క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :