బాలయ్య ఆల్ టైం సెన్సేషనల్ కాంబోపై లేటెస్ట్ బజ్.!

Published on Mar 25, 2023 9:00 pm IST

ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు అనీల్ రావిపూడితో తన కెరీర్ లో 108వ సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే. మరి దీని నుంచి రీసెంట్ గా వచ్చిన రెండు ఫస్ట్ లుక్ పోస్టర్ లు ఓ రేంజ్ లో హైప్ ని తీసుకొచ్చింది. మరి బాలయ్య తన కెరీర్ లో అఖండ నుంచి మళ్ళీ ట్రాక్ లో వచ్చి వీరసింహా రెడ్డి తో దానిని కొనసాగించారు.

మరి తన కెరీర్ లో సెన్సేషనల్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీను తో హ్యాట్రిక్ సినిమాలు చేసి ఒకదాన్ని మించి ఒక భారీ హిట్స్ కొట్టగా ఇక నెక్స్ట్ నాలుగో సినిమాపై ఇప్పుడు క్రేజీ బజ్ ఇప్పుడు తెలుస్తుంది. వీరి సెన్సేషనల్ కాంబోలో సినిమా అయితే ఈ ఏడాది బాలయ్య పుట్టినరోజు కానుకగా జూన్ లో అయితే అధికారికంగా అనౌన్స్ కానున్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. మరి ఇది కొత్త సినిమానా లేక అఖండ కి సీక్వెల్ సినేమానా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :