చైతు “థ్యాంక్ యూ” ఫస్ట్ లుక్ కి టైం ఫిక్స్ అయ్యిందా.!

Published on Jun 10, 2021 2:00 pm IST

అక్కినేని యువ హీరో అక్కినేని నాగ చైతన్య హీరోగా చేసిన లేటెస్ట్ చిత్రం “లవ్ స్టోరీ” ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ అయ్యి రిలీజ్ కు కూడా రెడీగా ఉంది. ఇక ఇదిలా ఉండగానే మరో టాలెంటెడ్ దర్శకుడు అందులోని తమ ఆస్థాన దర్శకునిగా మారిన విక్రమ్ కే కుమార్ తో ఓ ఇంట్రెస్టింగ్ సినిమాను స్టార్ట్ చేసాడు. అదే “థ్యాంక్ యు ది మూవీ”..

అనౌన్సమెంట్ నాటి నుంచే మంచి అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం కూడా ఆల్మోస్ట్ ముగింపు దశలోనే ఉంది. అయితే ఇప్పుడు ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ కు సమయం ఫిక్స్ అవుతున్నట్టు తెలుస్తుంది. మరి ఆ బజ్ ప్రకారం చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ జూన్ చివర్లో కానీ జూలై మొదటి వారంలో కానీ విడుదల చెయ్యాలని అనుకుంటున్నారట. ఇక ఈ చిత్రంలో చైతు సరసన రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తుండగా దిల్ రాజు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :