వెంకీ, చైతూల సినిమాకి ఆసక్తికరమైన టైటిల్ !
Published on Jun 4, 2018 7:36 pm IST

నాగ చైతన్య, విక్టరీ వెంకటేష్ లు కలిసి ఒక మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్న విషయం అందరికీ విధితమే. ఇటీవలే ‘జై లవ కుశ’తో విజయాన్ని అందుకున్న దర్శకుడ్ బాబీ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారు. తాజా సమాచారం మేరకు ఈ చిత్రానికి ‘వెంకీ మామ’ అనే టైటిల్ ను అనుకుంటున్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు.

వరసకు మామ అల్లుళ్ళు అయిన వెంకీ, చైతులు గతంలో ‘ప్రేమమ్’ సినిమాలో కొద్దిసేపు స్క్రీన్ షేర్ చేసుకుని ప్రేక్షకుల్ని అలరించారు. ఈ నెలలోనే ఈ సినిమా లాంచ్ అయ్యే అవకాశాలున్నాయి. ఈ సినిమాలో చైతన్యకు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ ను తీసుకున్న మేకర్స్ వెంకీ సరసన బాలీవుడ్ నటి హుమా ఖురేషీని తీసుకునే యోచనలో ఉన్నారట.

కోన వెంకట్, సురేష్ బాబు, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కలిసి సంయుక్తంగా ఈ మల్టీ స్టారర్ చిత్రాన్ని నిర్మించనున్నారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook