చరణ్, శంకర్ భారీ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ బజ్..!

Published on Jun 18, 2021 1:15 pm IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టేకప్ చేసిన సెన్సేషనల్ ప్రాజెక్ట్స్ లో ఇండియన్ జేమ్స్ కేమరూన్ శంకర్ కాంబోలో సెట్ చేసిన చిత్రం కూడా ఒకటి. మరి ప్రస్తుతం “RRR” మరియు “ఆచార్య” చిత్రాలతో బిజీగా ఉన్న చరణ్ ఈ సిసలైన ప్రాజెక్ట్ ను ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేస్తాడా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కానీ మరోపక్క శంకర్ కు పలు చిక్కులు ఉండడం మూలాన ఎపుడో పట్టాలెక్కాల్సిన ఈ చిత్రం క్రమంగా దూరం జరుగుతూ వస్తుంది. కానీ మరి ఇపుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న బజ్ ప్రకారం ఈ చిత్రం ఎప్పుడు మొదలు కానుందో తెలుస్తుంది. ఈ చిత్రాన్ని మేకర్స్ ఆగష్టు మధ్య నుంచి స్టార్ట్ చేసే అవకాశం ఉందని స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది.

మరి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ఎప్పుడో స్టార్ట్ చేసేసిన సంగతి తెలిసిందే. మరి ఈసారి అయినా ఈ అనుకున్న సమయానికి ఈ చిత్రం స్టార్ట్ అవుతుందో లేదో చూడాలి. ఇక శంకర్ మరియు చరణ్ ల కెరీర్ లో బెంచ్ మార్క్ చిత్రంగా నిర్మాత దిల్ రాజు తమ బ్యానర్ నుంచి కూడా 50వ సినిమాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :