చరణ్ మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ బజ్.!

Published on Apr 7, 2021 1:00 pm IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు రెండు బడా మల్టీ స్టారర్ చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి అలాగే వీటిలో రాజమౌళితో చేస్తున్న “రౌద్రం రణం రుధిరం” పాన్ ఇండియన్ లెవెల్లో విడుదల కానుంది. అయితే కొరటాలతో తీస్తున్న “ఆచార్య” కూడా కంప్లీట్ అయ్యిపోయాక ఎలాంటి సినిమా టేకప్ చేస్తాడా అన్న సమయంలో ఊహించని విధంగా సెన్సేషనల్ దర్శకుడు శంకర్ తో సినిమా అనౌన్స్ చేసాడు. ఇక ఆల్రెడీ దీనికి రావాల్సిన హైప్ వచ్చేసి స్థిరంగా ఉంది.

కానీ దీని తర్వాత కూడా చరణ్ ను మరో మంచి బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కూడా ఉంటుందని తెలిసింది. అదే టాలెంటెడ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో. ఈ కాంబోపై ఎప్పటి నుంచో గాసిప్స్ ఉన్నాయి.. ఇలా వచ్చిన లేటెస్ట్ బజ్ ప్రకారం చరణ్ ఆల్రెడీ గౌతమ్ చెప్పిన స్క్రిప్ట్ వినడమే కాకుండా సినిమా ఓకే చేసినట్టు కూడా గాసిప్స్ వినిపిస్తున్నాయి. మరి అలాగే ఈ చిత్రం ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అని మరో టాక్ కూడా ఉంది. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :