“కస్టడీ” స్ట్రీమింగ్ పార్ట్నర్ పై లేటెస్ట్ బజ్.!

“కస్టడీ” స్ట్రీమింగ్ పార్ట్నర్ పై లేటెస్ట్ బజ్.!

Published on May 13, 2023 4:59 PM IST

ఈ వారం థియేటర్లులో రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో టాలీవుడ్ యంగ్ అండ్ ఫైనెస్ట్ హీరో నాగ చైతన్య హీరోగా దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ చిత్రం “కస్టడీ” కోసం అందరికీ తెలిసిందే. డీసెంట్ ప్రమోషన్స్ నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రానికి మొదటి రోజు డీసెంట్ ఓపెనింగ్స్ కూడా దక్కాయి. అయితే ఈ సినిమా పోస్ట్ థియేట్రికల్ రిలీజ్ ఓటిటి స్ట్రీమింగ్ ఎందులో అనేది మాత్రం క్లారిటీ రాలేదు.

అయితే ఈ డీల్ ఇంకా లాక్ కాలేదని టాక్ ఉండగా మరి ఇప్పుడు ఈ సినిమా స్ట్రీమింగ్ పార్ట్నర్ ఎవరు అనేది రూమర్ వినిపిస్తుంది. మరి ఈ సినిమా ఓటిటి హక్కులు అయితే ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమా హక్కులు వీరే తీసుకున్నారా లేదా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి యువన్ సంగీతం అందించగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు