సాయిధరమ్ తేజ్ ఆ ప్లాప్ దర్శకుడికి ఫిక్స్ అయినట్లే !

సాయిధరమ్ తేజ్ ఆ ప్లాప్ దర్శకుడికి ఫిక్స్ అయినట్లే !

Published on Jul 5, 2018 2:27 PM IST

sai dharam

సాయిధరమ్ తేజ్ వరుస పరాజయాల తర్వాత కరుణాకరన్ దర్శకత్వంలో చేసిన ‘తేజ్ ఐ లవ్ యూ’ చిత్రంతో రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఐతే ‘ఈడు గోల్డ్ ఎహే’ చిత్రంతో ఫ్లాప్ డైరెక్టర్ల లిస్ట్ లోకి వెళ్ళిపోయిన వీరు పోట్ల దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ ఓ చారిత్రక నేపథ్యంలో సాగే చిత్రంలో నటిస్తున్నాడని గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే.

తాజా సమాచారం ప్రకారం ఈ నెలాఖర్లో లోగా ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన రానుందట. ఈ చిత్రం శ్రీ కృష్ణదేవరాయలు కాలంనాటి కథ అయినప్పటికీ ప్రధానంగా ఎంటర్టైన్మెంట్ తోనే సాగుతుందని, పైగా సునీల్ కూడా ఓ ప్రధానమైన పాత్రలో కనిపించానున్నాడని సినీవర్గాల నుండి సమాచారం అందుతోంది.

తాజా వార్తలు