మహేష్ – త్రివిక్రమ్ ప్రాజెక్ట్ హీరోయిన్ పై లేటెస్ట్ బజ్..!

Published on Jun 9, 2021 3:01 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటి వరకు చేసిన అందరి దర్శకుల్లో త్రివిక్రమ్ కాంబోకి ఒక స్పెషల్ క్రేజ్ ఉంది. వీరి నుంచి వచ్చిన రెండు సినిమాలు విజయంతో సంబంధం లేకుండా ఇప్పటికీ తెలుగు ఆడియెన్స్ మనసులు గెలుచుకున్నాయి. అందుకే ఈ క్రేజీ కాంబో నుంచి హ్యాట్రిక్ సినిమా అని చెప్పడంతో ఆ హైప్ మరో స్థాయికి వెళ్ళింది.

అయితే ఈ చిత్రంకు క్యాస్టింగ్ పరంగా మాత్రం గత కొన్నాళ్ల నుంచి ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. త్రివిక్రమ్ సినిమా అంటే హీరోయిన్ నుంచి ప్రతి రోల్ కి కూడా సాలిడ్ క్యాస్టింగ్ ఉంటుంది. అలా ఇతర భాషల నుంచి చాలా మంది నటులను ఇక్కడికి తీసుకొచ్చి మంచి రోల్స్ ఇచ్చారు.

మరి ఈ సినిమా హీరోయిన్ విషయంపైనే మరో ఇంట్రెస్టింగ్ బజ్ ఇప్పుడు బయటకి వచ్చింది. ఈ చిత్రంలో మహేష్ సరసన కోలీవుడ్ “మాస్టర్” బ్యూటీ మాళవికా మోహనన్ నటించనున్నట్టుగా బజ్ వినిపిస్తుంది. అయితే ఇది వరకే పూజా హెగ్డే మరియు జాన్వీ కపూర్ ల పేర్లు ఉండగా పూజా ను మాళవిక రీప్లేస్ చేస్తుందేమో అని టాక్. మరి ఇందులో ఎంత వరకు నిజముందో కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం :