నాని మాస్ ప్రాజెక్ట్ “దసరా” రిలీజ్ పై లేటెస్ట్ బజ్.!

Published on Jun 10, 2022 3:00 am IST

నాచురల్ స్టార్ నాని కాస్త ‘నాటు’రల్ స్టార్ నానిగా ట్రాన్స్ఫార్మ్ అయ్యిన లేటెస్ట్ మాస్ ప్రాజెక్ట్ “దసరా”. నాని కెరీర్ లోనే ఒక బిగ్గెస్ట్ మాస్ ప్రాజెక్ట్ ఇది. దర్శకుడు శ్రీకాంత్ ఓడెల తెరకెక్కిస్తున్న ఈ చిత్రం అదిరే మాస్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతుంది. అయితే ఈ చిత్రాన్ని కూడా నాని శరవేగంగా కంప్లీట్ చేస్తుండగా ప్రస్తుతం “అంటే సుందరానికి” ప్రమోషన్స్ లో బిజీగా ఉండడం వల్ల కాస్త బ్రేక్ ఇచ్చాడు. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ పై గత కొన్ని వారాల కితం ఓ టాక్ బయటకి వచ్చింది.

దీని ప్రకారం అయితే ఈ సినిమాని దసరాకే రిలీజ్ చేస్తున్నట్టు టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు అయితే ఈ చిత్రం దసరా రేస్ లో రిలీజ్ అవ్వట్లేదు అని తెలుస్తుంది. బహుశా డిసెంబర్ నెలలో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని టాక్. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో నాని సరసన హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తుండగా సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఎస్ ఎల్ వి బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :