తారక్ – కొరటాల ప్రాజెక్ట్ పై లేటెస్ట్ బజ్.!

తారక్ – కొరటాల ప్రాజెక్ట్ పై లేటెస్ట్ బజ్.!

Published on Apr 17, 2021 12:12 PM IST


యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు రాజమౌళితో “RRR” అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రం అనంతరం చెయ్యబోయే మరో భారీ ప్రాజెక్ట్ పై కూడా క్లారిటీ వచ్చేసింది. తన బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివతో తారక్ 30వ సినిమా కన్ఫర్మ్ అయ్యింది. మరి ఇక్కడ నుంచి ఈ సినిమాపై ఆసక్తికర టాక్స్ మొదలయ్యాయి.

మరి వాటి ప్రకారం ఇప్పుడు ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ తారక్ సరసన నటించనున్నారని తెలుస్తుంది. అలాగే వారిలో ఒకరు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అన్నట్టు కూడా వినికిడి. మరి వారి పేర్లు ఇంకా ఖరారు కాలేదు కానీ ప్రస్తుతానికి కొరటాల ఆ పనుల్లో ఉన్నారట. మరి ప్రస్తుతం కొరటాల మెగాస్టార్ చిరంజీవితో “ఆచార్య” అనే భారీ బడ్జెట్ చిత్రం తీస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు