‘హరిహర వీరమల్లు’ పవర్ఫుల్ సాంగ్ ఆరోజున!?

‘హరిహర వీరమల్లు’ పవర్ఫుల్ సాంగ్ ఆరోజున!?

Published on May 17, 2025 11:01 PM IST

HariHars Veera Mallu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా జ్యోతి కృష్ణ అలాగే క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రమే “హరిహర వీరమల్లు”. మరి ఎన్నో అంచనాలు నడుమ తెరకెక్కించిన ఈ సినిమా పట్ల మళ్ళీ సాలిడ్ హైప్ బిల్డప్ అవుతుంది. ఇక ఇందుకు తగ్గట్టుగానే మేకర్స్ క్రేజీ ప్లానింగ్స్ చేస్తుండగా సినిమా నుంచి ఆల్రెడీ వచ్చిన రెండు పాటలు ఆడియెన్స్ ని అలరించాయి. మరి మూడో పాటగా మేకర్స్ ఒక పవర్ఫుల్ నెంబర్ ని రిలీజ్ చేయనున్నట్టుగా తెలుస్తుంది.

అది దాదాపు పవన్ పై సాగే హరిహర వీరమల్లు టైటిల్ ట్రాక్ లేదా థీమ్ అన్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సాంగ్ ని ఈ మే 21న విడుదల చేయనున్నట్టుగా తెలుస్తుంది. ఇంతే కాకుండా ప్రెస్ మీట్ పాన్ ఇండియా మీడియా వారితో కూడా ప్లాన్స్ చేస్తున్నారట. మొత్తానికి జూన్ 12 లోపు హరిహర వీరమల్లు రీసౌండ్ ని గట్టిగానే మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని చెప్పాలి. ఇక కీరవాణి ఇచ్చిన మూడో సాంగ్ ఎలా ఉంటుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు