పవర్ స్టార్ మరో మోస్ట్ అవైటెడ్ సినిమాపై నయా బజ్.!

Published on May 13, 2021 10:00 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు మూడున్నర ఏళ్ళు తర్వాత “వకీల్ సాబ్” తో మళ్ళీ టాలీవుడ్ కు తన బాక్సాఫీస్ స్టామినా రుచి చూపించారు. మరి దీని తర్వాత పవన్ లైనప్ లో మరిన్ని సాలిడ్ ప్రాజెక్ట్ లు కూడా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ప్రతి ప్రాజెక్ట్ కూడా మంచి మోస్ట్ అవైటెడ్ గా ఉంది.

కానీ ముఖ్యమైన ప్రాజెక్ట్స్ లో దర్శకుడు హరీష్ శంకర్ తో ప్లాన్ చేసింది మాత్రమే కాకుండా నిర్మాత బండల గణేష్ తో ప్లాన్ చేసిన చిత్రం కూడా ఉంది. మరి ఫ్యాన్ ప్రొడ్యూసర్ తో ప్లాన్ చేసిన ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రం కోసం కూడా పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ కాంబో కోసం దర్శకుని వేటలో ఎప్పటి నుంచో ఉండగా ఇప్పుడు ఆ దర్శకుడు దొరికినట్టుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఆ చిత్రానికి దర్శకుడు రమేష్ వర్మ పేరు లైన్ లోకి వచ్చిందట మరి దినులో ఎంత వరకు నిజముందో కాలమే నిర్ణయించాలి. ఈ దర్శకుడు ప్రస్తుతం మాస్ మహారాజ్ రవితేజతో “ఖిలాడి” అనే భారీ యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :