“సలార్” షూట్ పై లేటెస్ట్ బజ్..!

Published on Mar 26, 2021 7:00 am IST

ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న పాన్ ఇండియన్ చిత్రాల్లో సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ప్లాన్ చేస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ “సలార్” కూడా ఒకటి. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంపై తారా స్థాయి అంచనాలు ఉన్నాయి.

అయితే మరి ఇటీవల షూట్ జరుపుకున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ కు సర్వం సిద్ధం అవుతున్నట్టు తెలుస్తుంది. లాస్ట్ టైం గోదావరిఖని ప్రాంతంలో భారీ సెట్స్ లో షూట్ జరుపుకున్న ఈ చిత్రం ఈసారి చేవెళ్ల మరియు శంషాబాబ్ ప్రాంతాల్లో మరో భారీ సెట్ వర్క్స్ జరుపుకుంటున్నట్టుగా తెలుస్తుంది.

మరి ఇక్కడ షూట్స్ లో ప్రభాస్ ఆదిపురుష్ పై నడుస్తున్న రెండో షెడ్యూల్ పూర్తయిన అనంతరం పాల్గొననున్నాడట. మరి అలాగే గుజరాత్ లో కూడా వచ్చే ఏప్రిల్ 20న ఓ కీలక షెడ్యూల్ ఉందని ఆ మధ్య రూమర్స్ వచ్చాయి. మరి వీటిలో ఏది ఫిక్స్ అవ్వనుందో అధికారికంగా తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :